- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎం మోడీకి లేఖ ఎఫెక్ట్!.. లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు తాజాగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆయనకు సమన్లు పంపింది. సీబీఐ అధికారులు పంపిన సమన్ల ప్రకారం.. యూపీఏ 1 ప్రభుత్వంలో 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనే రైల్వేలో గ్రూప్ డీ పోస్టులకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ అవకతవకలకు పాల్పడ్డట్లు సీబీఐ ఆరోపించింది. ఉద్యోగాల పేరిట అభ్యర్థుల నుంచి భూమిని కానుకగా పొందారని లాలూపై సీబీఐ అభియోగాలు మోపింది. పాట్నాకు చెందిన కొంతమంది ఉద్యోగార్థులు లాలూ కుటుంబ సభ్యులు, లాలూకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ పేరు మీదుగా కొంత భూమిన కానుకగా ఇచ్చారనిన సీబీఐ నోటీసుల్లో పేర్కొంది.
ఈ విషయమై మంగళవారం లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ ఎదుట హాజరు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి కొన్ని గంటల ముందు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్కామ్ కేసులో సీబీఐ అధికారులు బీహార్ మాజీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవీని ఆమె నివాసంలో విచారించారు. కాగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ రాజకీయ కక్ష సాధించేందుకు వాడుతున్నారంటూ ప్రతిపక్షాలకు చెందిన ఎనిమిది పార్టీల నాయకులు ఆదివారం పీఎం మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ ఎనిమిది పార్టీల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ కూడా ఉంది. లేఖ రాసి 24 గంటలు కూడా గడవకముందే లాలూ కుటుంబంపై సీబీఐ అధికారులు విచారణ పేరుతో దాడులు జరపడం చర్చనీయాంశంగా మారింది.