జీహెచ్ఎంసీ కార్మికులను రెగ్యులరైజ్ చేయరా?: ప్రభుత్వానికి ఆర్ఎస్ ప్రవీణ్ సూటి ప్రశ్న

by Javid Pasha |   ( Updated:2023-05-31 12:32:38.0  )
RS Praveen Kumar
X

దిశ, వెబ్ డెస్క్: వీఆర్ఏలు, జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీహెచ్ఎంసీ కార్మికుల రెగ్యులరైజ్ పై ప్రస్తావించారు. హైదరాబాద్ మహానగరంలోనే 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2012లో వారిని రెగ్యులరైజ్ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇన్నేళ్లైనా ఆ హామీలను నెరవేర్చలేదని ఆర్ఎస్పీ మండిపడ్డారు. పైగా దశలవారీగా జీహెచ్ఎంసీని రాంకీ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ కార్మికుల పొట్టగొడుతున్నారని సీఎంపై మండిపడ్డారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే జీహెచ్ఎంసీ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని, రాంకీ లాంటి దోపిడీ సంస్థలను ఇంటికి పంపిస్తామని ఆర్ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed