పోలీసులేమైనా మీ బానిసలా కేసీఆర్? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Javid Pasha |
పోలీసులేమైనా మీ బానిసలా కేసీఆర్? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలోని పోలీసులపై జరుగుతున్న అన్యాయంపై సీఎంను నిలదీశారు. ఈ క్రమంలోనే 2009 బ్యాచ్ కు చెందిన ఎస్సైల ప్రమోషన్ విషయం గురించి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. తమకు ప్రమోషన్ ఇవ్వాలంటూ ఆ ఎస్సైలు 45 సార్లు వినతి పత్రం ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు వారి ఫైల్ వంక చూడటానికి సీఎం కేసీఆర్, డీజేపీలకు సమయం దొరుకుతలేదని ఎద్దేవా చేశారు. పోలీసులేమైనా మీ బానిసలా కేసీఆర్ అంటూ ఆర్ఎస్పీ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజల పన్నుల నుంచి నెలకు నలుగున్నర లక్షల రూపాయల జీతం తీసుకుంటూ.. లంచాల కోసం మా ఫైళ్ల మీద కూర్చుంటారా అని ఫైర్ అయ్యారు. ఇలా అయితే తాము ప్రగతి భవన్ కు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా అంతకు ముందు టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ వ్యవహారంలో దమ్ముంటే తనకు నోటీసులు పంపాలని, తన వద్ద ఉన్న ఆధారాలు చూపెడుతానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ అధికారులకు సవాలు విసిరారు.

Advertisement

Next Story