- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ రాజకీయాలపై MP లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై తెలంగాణ బీజేపీ ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బీసీలు అణిచివేతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అవసరాలకు వాడుకుంటూ బీసీలను బానిసలుగా మార్చేశారని మండిపడ్డారు. బీసీల అభ్యున్నతికి కృషి చేసింది కేవలం ఎన్టీఆర్ ఒక్కరే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీసీల రిజర్వేషన్లు 20 శాతానికి కుదించి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ సీఎం జగన్‌పై సీరియస్ కామెంట్స్ చేశారు. నాలుగేళ్లలో బీసీ కమిషన్‌కు ఎందుకు చట్టబద్దత కల్పించలేదని జగన్‌ను ప్రశ్నించారు. ఎనిమిదేళ్లు నిర్లక్ష్యం చేశారని ఫైర్ అయ్యారు. బీసీలకు న్యాయం చేసే పార్టీ బీజేపీ ఒక్కటే అని అన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బీజేపీ దేశానికి ప్రధాన మంత్రిని చేసిందని చెప్పారు. మరోసారి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు జగన్ ‘నా బీసీలు’ అని నమ్మబలికేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.