- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లోక్ సభకు ఉపఎన్నిక? పక్కా ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ
దిశ, తెలంగాణ బ్యూరో : లోక్ సభకు త్వరలోనే ఉప ఎన్నిక రాబోతోంది. అందుకు బీజేపీ గ్రౌండ్ సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు అసెంబ్లీ స్థానాలపైనే ఫోకస్ పెట్టిన కమలనాథులు... లోక్ సభ స్థానాలపై కూడా దృష్టిసారించారు. పేరులో ఆర్ అక్షరం వచ్చే వారిపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురు టచ్‌లో ఉన్నారని, త్వరలోనే ఇద్దరు బీజేపీ గూటికీ చేరునున్నట్లు సమాచారం. అంతేకాదు ఉత్తర తెలంగాణలోని రెండు జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిపేరులో కూడా 'ఆర్' అక్షరం కలిగినవారేనని సమాచారం. బీజేపీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2023లో కూడా బైపోల్ అనివార్యమే.
భారతీయజనతాపార్టీ రాష్ట్రంలో స్పీడ్ పెంచింది. విస్తృత కార్యక్రమాలతో ప్రజల్లోకి చేరువ అవుతుంది. మరో పక్కా అధికార టీఆర్ఎస్, ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆపార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఫోకస్ పెట్టింది. చేరికలను ప్రోత్సహిస్తుంది. కమలం గూటికీ చేరే వారంతా పదవులకు రాజీనామా చేసి రావాలనే షరతు పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగానే మొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బైపోల్‌కు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆర్ అక్షరంతో ఉన్నవారే. ఆర్ బీజేపీకి కలిసి వస్తుండటంతో ప్రధానంగా ఆ అక్షరం పేరుతున్న ఉన్నవారిపైనే ఫోకస్ పెట్టింది. వారితో మంతనాలు ముమ్మరం చేసింది. అవసరం అయితే కేంద్రనాయకత్వంతో మాట్లాడి హామీలు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం లోక్ సభ స్థానాలపై కమలం గురిపెట్టింది. ఇద్దరు ఎంపీలను చేర్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు సైతం సత్పలితాలు ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఇద్దరు ఎంపీలు కమలం గూటికీ చేరుతారని కమలనాథులే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని... తిరిగి విజయం సాధిస్తామనే ధీమాను బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు.
బీజేపీకి ప్రస్తుతం నలుగురు...
తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో టీఆర్ఎస్-9, బీజేపీ-4, కాంగ్రెస్-3, ఎంఐఎం-1 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీకి ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ నుంచి డి.అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, సికింద్రాబాద్ జి.కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ సోయంబాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యుల పెంపునకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఇతర పార్టీల ఎంపీలతో మంతనాలు ప్రారంభించింది. పేరులో 'ఆర్' అక్షరం ఉన్నవారిపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. వారితో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరినట్లు సమాచారం. అధికారపార్టీకి చెందిన ఎంపీలే టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి ఓ ఎంపీ బీజేపీలో చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకున్నప్పటికీ... దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒక వేళ అదే జరిగితే ఈ ఏడాది చివరిలో గానీ, లేకుంటే వచ్చే ఏడాదిలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
అసెంబ్లీలోనూ బలపడుతున్న బీజేపీ...
రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీ 2018 ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో బీజేపీ సభ్యుల సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం మునుగోడు బైపోల్ విజయం సాధించి నాలుగుకు చేరుకుంటామనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మరిన్ని అసెంబ్లీ స్థానాలపై ఆపార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీలతో మంతనాలు జరిపారు. అయితే కొంతమంది సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ ఎప్పుడు చేరేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదనే కమలనాథులే పేర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ రెండు జిల్లాల్లో ఇద్దరు పేరులో 'ఆర్' అక్షరంతో ఎమ్మెల్యేలు చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారు బీజేపీలో చేరితో 2023లో మరో రెండు బైపోల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కమలం గూటికి చేరేవారు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో గెలిపించుకుంటామనే హామీలు ఇస్తుండటంతో రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
టీఆర్ఎస్‌కు గడ్డుకాలమే..?
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటం, బీజేపీ రాష్ట్రంలో యాక్టీవిటీస్‌ను పెంచడంతో పాటు అధికారపార్టీపై గురిపెట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను కమలం గూటికీ చేర్చుకోవాలనే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి పావులు కదిపిన ప్రాంతీయపార్టీల టార్గెట్‌గా ముందుకెళ్తుంది. ఈడీ, సీబీఐ దాడులు చేయడంతో అధికారపార్టీ నేతల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. అంతేగాకుండా కేసీఆర్ కుటుంబంపైనే ఢిల్లీ లిక్కర్ ఆరోపణలు రావడం, అనుచరుల ఇళ్లపై ఈడీ దాడులు స్టార్ట్ చేయడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో లబ్ డబ్ నెలకొంది. మరిన్ని దాడులు జరిగితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పార్టీ మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పొలిటికల్ బ్లేమ్ గేమ్ లో సెప్టెంబర్ 17,దీనిపై రాజకీయ పార్టీల వాదనేంటి?