- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ను ప్రజలు ఎప్పుడో బ్యాన్ చేశారు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కాగా దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. భజరంగ్ దళ్ ను బహిష్కరిస్తామని కాంగ్రెస్ చెబుతోందని, కానీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో బహిష్కరించారని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ‘కర్ణాటక సార్వభౌమాధికారం’ వ్యాఖ్యలపై కూడా నడ్డా స్పందించారు. సోనియా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మానసిక దిగజారుడు తనానికి నిదర్శమన్నారు.
ఓట్ల కోసం ఏదైనా మాట్లాడటం ఖండించదగినది అని అన్నారు. తాము ఎప్పుడూ 'తుక్డే తుక్డే' గ్యాంగ్‌తో ఉన్నవాళ్లే అలాంటి మాటలు మాట్లాడుతారని విమర్శించారు. ఇక ఏవైనా ఎన్నికలు ఉన్నప్పుడే రాహుల్ గాంధీకి ప్రజలు గుర్తుకు వస్తారని, సడెన్ రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తారని విమర్శించారు. కానీ తాము అలా కాదని.. ఏడాది పొడవునా ప్రజలతోనే ఉంటామని అన్నారు. బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య గల తేడా ఇదేనని నడ్డా స్పష్టం చేశారు.
Also Read..
తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు