పునః ప్రారంభమైన భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..

by Kalyani |
పునః ప్రారంభమైన  భట్టి  పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..
X

దిశ, నవాబుపేట: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 68వ రోజు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని రుక్కంపల్లి, చెన్నారెడ్డిపల్లి, ఇప్పటూరు, మల్లారెడ్డిపల్లి, కూచూరు, దొడ్డిపల్లి గ్రామాలలో కొనసాగింది. వడదెబ్బ వల్ల స్వల్ప అస్వస్థత గురైన భట్టి విక్రమార్క ఐదు రోజుల విరామం తర్వాత రుక్కంపల్లి గ్రామం నుంచి మంగళవారం తిరిగి తన పాదయాత్రను పునః ప్రారంభించారు. 68వ రోజు 12 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన ఆయన నేరుగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

యాత్రకు అపూర్వ ఆదరణ లభించింది. దారి పొడవునా ప్రజా సమస్యలు వింటూ భట్టి తన పాదయాత్ర కొనసాగించారు. నాలుగు నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు ప్రజా సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని భట్టి వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రజా యుద్ధ నౌక గద్దర్ తదితరులు పాల్గొని భట్టి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

పాదయాత్రకు పలు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి భట్టి విక్రమార్కకు వీరతిలకం దిద్ది స్వాగతించారు. గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అభివాదం చేస్తూ భట్టి విక్రమార్క తన పాదయాత్రను ముందుకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, జడ్చర్ల నియోజకవర్గ ఇంచార్జ్ అనిరుద్ రెడ్డి, నాయకులు ఊబేదుల్లా కొత్వాల్, దుష్యంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed