- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీలోకి బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్!
దిశ, వెబ్ డెస్క్: త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఈ క్రమంలోని పలువురిని తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తాజాగా బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రెవిన్యూ మంత్రి ఆర్ అశోకాతో మంగళవారం భాస్కర్ రావు భేటీ అయ్యారు. అంతకు ముందు భాస్కర్ రావు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామళైతో కూడా భేటీ అయ్యారు. ఈ వరుస భేటీల నేపథ్యంలో భాస్కర్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం భాస్కర్ రావు కర్ణాటక ఆప్ వైస్ ప్రెసిడెంట్ గా, ఆప్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు. బీజేపీ, ఆప్ కు మధ్య తీవ్ర రాజకీయ వైరం నెలకొన్న నేపథ్యంలో భాస్కర్ రావు ఎపిసోడ్ ఆసక్తిగా మారింది. ఒక వేళ ఈ మాజీ పోలీస్ అధికారి బీజేపీలో చేరితో కర్ణాటకలో ఆప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా భాస్కర్ రావు 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. 2019 నుంచి 2020 వరకు ఆయన బెంగళూరు పోలీస్ కమిషనర్ గా పని చేశారు. 2022లో రిటర్ అయ్యాక యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు.