వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్ర.. ఒవైసీ సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |
Asaduddin Owaisi Asks, Why there is no Debate on Ladakh Border Crisis In Parliament
X

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రం జేపీసీ(JPC)కి పంపడంపై ఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడే కాదని.. స్పీకర్ జేపీసీని ఏర్పాటు చేసిన తర్వాత మాట్లాడుతా అని అన్నారు. అంతకుముందు లోక్‌సభలోనూ ఒవైసీ బిల్లును వ్యతిరేకించారు. సవరణలు చేయడానికి ఈ సభకు అర్హత లేదని అన్నారు. ఎమ్ఐఎమ్‌తో పాటు కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణముల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ - జేపీసీకి పంపించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అందుకు అంగీకరించిన కేంద్రం.. ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును జేపీసీకి పంపిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story