ఏయ్‌ లోకేశ్‌.. కన్నెర్రజేస్తే మాడిమసైపోతావ్.. మంత్రి RK Roja

by Javid Pasha |   ( Updated:2023-02-14 14:33:50.0  )
ఏయ్‌ లోకేశ్‌.. కన్నెర్రజేస్తే మాడిమసైపోతావ్.. మంత్రి RK Roja
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ఓ వెధవ.. ఐరన్ లెగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఏయ్‌ లోకేశ్‌.. మా జగనన్న మౌనం వహించేంత వరకే నీ ఆటలు.. ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే నువ్వు మాడిమసైపోతావ్‌. మైకిస్తే ఏదేదో చేస్తానంటూ.. పందిముట్లు, కొర్రీలంటూ చెత్తవాగుడు వాగుతున్నావ్‌.. మహిళలను గౌరవించడం నేర్చుకో..' అని మంత్రి ఆర్కే రోజా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. లోకేశ్ చేసేది యువగళం పాదయాత్ర కాదని అది జోకేశ్‌ యాత్ర అని విమర్శించారు. నగరి నియోజకవర్గంలో ప్రజలు రాకపోవడంతో టెంటులోనే లోకేశ్ నిద్రపోయాడని.. అతడి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని చెప్పుకొచ్చారు.

స్థానిక ప్రజలు రాకపోవడంతో అటు బెంగుళూరు, ఇటు చెన్నై నుంచి అప్పటికప్పుడు జనాన్ని తెచ్చుకుని ఏదో హడావిడి చేస్తున్నారని విమర్శించారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న లోకేశ్‌పై మండిపడ్డారు. లోకేశ్‌ అనే వెధవకు తన కుటుంబ సభ్యుల పేర్లు పలికే అర్హత లేదని ధ్వజమెత్తారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరైనా ఉన్నారంటే.. అది నారా కుటుంబమేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మిణి, లోకేశ్‌‌లే అవినీతి చక్రవర్తులుగా గుర్తింపు పొందారని రోజా మండిపడ్డారు. ఇసుక దొంగల్ని, చందనం దొంగల్ని తన పక్కన పెట్టుకుని లోకేశ్‌ మాట్లాడుతున్నాడంటే చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ ఆస్తుల మీద.. నా ఆస్తుల మీద సీబీఐ చేత ఎంక్వైరీ చేయించడానికి సిద్ధమేనా..? అని రోజా సవాల్ విసిరారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనుబడుతుందన్న సామెతగా లోకేశ్‌ ఒక అవినీతి తండ్రి పెంపకంలో పెరిగి.. అందరూ తను, తన తండ్రి మాదిరిగానే అవినీతిపరులనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. 'నేను 30 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. నా సంపాదన ఎంతో.. నేనెంత ఇన్‌కం ట్యాక్స్‌ కట్టానో తెలుసుకో లోకేశ్‌ అని సూచించారు. లోకేశ్ అడుగుపెట్టిన దగ్గర్నుంచి రాష్ట్రానికి, ఎన్టీఆర్ కుటుంబానికి, మీ పార్టీ నేతలకి ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది అని ఆరోపించారు.

లోకేశ్ రాజకీయ ఎంట్రీతోనే చంద్రబాబు రాజకీయ పతనం మొదలైందని చెప్పుకొచ్చారు. అతని పాదయాత్ర అనగానే జనాలు పిట్టల్లా చనిపోతున్నారు. లోకేశ్‌లాంటి ఐరెన్‌లెగ్‌ అంకుల్‌ పాదయాత్ర అనగానే జనాలు భయపడి బయటకు రాకుండా ఇళ్లకు తలుపులేసుకుంటున్నారు అని రోజా చెప్పుకొచ్చారు. జబర్దస్త్‌ అనేది మంచి ఆరోగ్యకర, ఆహ్లాదకరమైన కామెడీ షో. దాన్ని కూడా ఒక బూతు కార్యక్రమంగా లోకేశ్‌ మాట్లాడుతున్నాడంటే.. మహిళలు అతన్ని దేంతో కొడతారో దాంతో ఖచ్చితంగా కొడతారు అని మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరించారు.

Advertisement

Next Story