- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్చెన్నా తెగబలిసి మాట్లాడొద్దు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మరణించి 28ఏళ్లు అయినా ఆయన ఆత్మను నేటికీ చంద్రబాబు చంపుతూనే ఉన్నాడని.. చిత్రవధ చేస్తూనే ఉన్నాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. వెన్నుపోటు పొడిచి వైశ్రాయ్ హోటల్ ముందు చెప్పులు, రాళ్లు, కర్రలతో కొట్టించి ఘోరంగా అవమానించి చంద్రబాబు.. నేడు ఎన్టీఆర్ శతజయంతి పేరిట ఎన్టీఆర్ విగ్రహానికి దండేసి, దండం పెడుతున్నాడని మండిపడ్డారు. దేవుడు క్షణకాలం ఊపిరిపోస్తే.. రాజమహేంద్రవరంలో ఆ మహానాడు వేదికపైనే చంద్రబాబు భరతం పడతానని, నిట్టనిలువునా పాతరేస్తానని ఎన్టీఆర్ కోరుకుంటాడన్నారు. ఎన్టీఆర్ చావుకు కారకులైన సిగ్గులేని వెధవలంతా ఒకచోట చేరి మహానాడు, శతజయంతి ఉత్సవాలు అంటూ ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల ముందు 600 పైచిలుకు హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి కనీసం ఒక్క హామీనైనా ప్రజల దరికి చేర్చగలిగావా..? అధికారంలో ఉండగా ఏదేదో చేశానని చంద్రబాబు వాగుతున్నాడు అని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడు బీసీ నాయకులందరి ముందు బీసీలకు మేలు చేశానని బద్మాష్ బాబు మొరుగుతున్నాడు అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అనే వ్యక్తి బీసీలను బానిసలుగా మాత్రమే చూశాడు తప్ప.. వారి మేలు కోసం ఏ రోజూ పాటుపడలేదు అని చెప్పుకొచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకువస్తారని విమర్శించారు. బీసీలకు ఆత్మగౌరవం వైసీపీ ప్రభుత్వంలో సాధ్యమైంది అని చెప్పుకొచ్చారు.
బీసీలంతా తలెత్తుకొని తిరుగుతున్నారంటే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన రాజకీయ, ఆర్థిక, విద్య, ఆరోగ్యపరమైన ప్రతి అంశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఎదుగుదల ఉంది. వీటిపై చర్చించేందుకు రమ్మంటే టీడీపీ పారిపోతుంది అని ఎద్దేవా చేశారు. ఒక సెంటు స్థలం నువ్వు పడుకోవడానికి సరిపోదా అచ్చెన్నాయుడు.. నువ్వంటే పందిలా ఉన్నావు కాబట్టి ఒక సెంటు కాదు ఊరు కూడా సరిపోదు అని విమర్శించారు. శరవేగంగా ఇళ్లు కట్టిస్తుంటే.. పడుకోవడానికి సరిపోదని ఆంబోతు అచ్చెన్నాయుడు తెగబలిసి మాట్లాడుతున్నారు. పనికిమాలిన చంద్రబాబు ఆ సెంటు స్థలంలో సమాధికి కూడా సరిపోదని నీచంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.ఆ సెంటు స్థలంలో అక్కచెల్లెమ్మలు కట్టుకునే ఇంటి పునాదుల్లోనే టీడీపీ సమాధి కాబోతుంది. చంద్రబాబు ఏరోజు అయినా పేదలకు సెంటు స్థలం ఇచ్చారా..? చంద్రబాబు ఎన్ని రంకెలేసినా, ఎంత గాంఢ్రించినా.. సీఎం వైయస్ జగన్‌ను, వైయస్‌ఆర్ సీపీని ఇంచు కూడా కదిలించలేరు అని జోగి రమేశ్ అన్నారు.