హరీశ్ రావు వ్యాఖ్యల్లో తప్పేముంది.. జగన్ సర్కార్‌పై సీపీఐ రామకృష్ణ సీరియస్

by GSrikanth |   ( Updated:2022-10-02 03:11:29.0  )
హరీశ్ రావు వ్యాఖ్యల్లో తప్పేముంది.. జగన్ సర్కార్‌పై సీపీఐ రామకృష్ణ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు ప్రకటించారు. ఇటీవల తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కంటే తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అన్నారు. అదే సమయంలో ఉదాహరణలా ప్రస్తావిస్తూ ఏపీలో పరిస్థితిని కూడా ప్రస్తావించారు. దీంతో ఏపీలో ఉద్యోగుల సమస్యల గురించి మంత్రి హరీశ్ రావు మాట్లాడిన మాటలను తప్పుపడుతూ ఏపీ మంత్రులంతా మంత్రి హరీశ్ రావుపై సీరియస్ కామెంట్స్ చేశారు. తాజాగా.. హరీశ్ రావు వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ స్పందించారు. ఏపీలో ఉద్యోగులు పడుతున్న సమస్యల గురించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నది నిజం కాదా? అని మంత్రులను రామకృష్ణ నిలదీశారు.

Also Read: ముఖ్యమంత్రి పదవి కోల్పోనున్న కేసీఆర్.. జాతీయ పార్టీతో కొత్త చిక్కులు!

Advertisement

Next Story