- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భట్టి సారధ్యంలో యాక్షన్ స్టార్ట్.. Revanth Reddyకి గురి!
దిశ, తెలంగాణ బ్యూరో : 'తాడును ముట్టినా పాములా మారుతుంది" అన్న చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. నిర్ణయాల నుంచి నియామకాల వరకు ఎలాంటి మార్పులు జరిగినా అసంతృప్తి భగ్గుమంటోంది. పార్టీ నేతలు వ్యతిరేఖ గళాలు ఎత్తుతున్నారు. దీనికి సీనియర్ల సపోర్టు దక్కుతోంది. యాంటీ రేవంత్ టీం ఆగమేఘాల మీద దానికి ఆజ్యం పోసినట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా టీపీసీసీ, డీసీసీ కమిటీల నియామకాలు పార్టీలో కల్లొల్లాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి. ఒక్కొక్కరుగా వ్యతిరేఖత జెండా ఎత్తుకుంటున్నారు. కమిటీల్లో పేరు వచ్చినా వారు తమను తక్కువ చేశారని చెప్తుంటే.. పదవులు రాని వారు తమను గుర్తించడం లేదంటూ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సారథ్యంలో సీనియర్లు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. అయితే, కమిటీల ఏర్పాటులో తనను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారంటూ భట్టి ప్రకటించడంతో పార్టీలో మరింత చర్చగా మారింది.
మాకూ అన్యాయం జరిగింది
వచ్చే ఎన్నికలకు జంబో టీంగా ఇటీవల టీపీసీసీ, జిల్లా పార్టీ కమిటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కమిటీల్లో టీపీసీసీ చీఫ్రేవంత్మార్కు కొంతమేరకు స్పష్టమైంది. జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పుల్లో ఆయన వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా టీపీసీసీ జనరల్ సెక్రెటరీ, ఉపాధ్యక్షుల్లో కూడా అదే కొనసాగింది. అయితే, టీపీసీసీకి సమాంతరంగా మరో కమిటీ వేయాలంటూ ముందుగానే రాష్ట్రానికి చెందిన సీనియర్లంతా ఏఐసీసీకి సూచించారు. దీనిపై నిర్ణయం తీసుకున్నట్టుగానే వ్యవహరించిన ఏఐసీసీ.. ఎగ్జిక్యూటివి కమిటీని ప్రత్యేకంగా వేసినా.. దాని బాధ్యతలను సైతం రేవంత్‌కే అప్పగించారు. దీంతో సీనియర్లు కొంత మేరకు అలిగారు. ఇక, కాంగ్రెస్పార్టీ పొలిటికల్ అఫైర్స్కమిటీలో కూడా చాలా మంది సీనియర్లకు చాన్స్ ఇచ్చినా నేతలను సంతృప్తి పర్చలేదు. దీంతో కమిటీలపై వివాదాలు మొదలయ్యాయి.
అసలు ఏకమిటీలోనూ చోటు దక్కని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజలే ముఖ్యమని ప్రకటించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. టీపీసీసీ జనరల్సెక్రెటరీ పదవి తనకు చాలా చిన్నదనే కారణంగా మాజీ మంత్రి కొండా సురేఖ ఆ పదవికి రాజీనామా చేశారు. కొత్త కమిటీలో సముచిత స్థానం దక్కలేదని మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేస్తే.. ఈ కమిటీలో తనకు చోటివ్వలేదని పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ రాజీనామాకు దిగారు. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సెల్ వైస్ చైర్మన్‌గా ఉన్న తనకు పొలిటికల్ ఎఫైర్ కమిటీలో ఎందుకు స్థానం ఇవ్వలేదని బెల్లయ్య నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ సెక్రటరీ స్థాయి పోస్టులో ఉన్న తనకు పీసీసీ కమిటీ లేదంటే ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటివ్వరా? అంటూ ఆయన నిలదీశారు. ఎస్టీ సామాజిక వర్గ నేతలపై పార్టీలో చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా పీఏసీలో కోదండరెడ్డి, తనకు నిబంధన ప్రకారం అవకాశం ఇవ్వాలని మాణిక్కం ఠాగూర్‌కు కూడా లేఖ రాసినట్లు గుర్తుచేశారు. కానీ.. తమ ఇద్దరికీ అవకాశం ఇవ్వలేదని బెల్లయ్య నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందంటూ మెదక్ జిల్లా నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు మంగళవారం మీడియా ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.
భట్టి నివాసంలో భేటీ
పార్టీలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు సీఎల్పీ భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమాశంలో కోదండరెడ్డి, వీహెచ్, మహేశ్వర్‌రెడ్డి, మధుయాష్కీతో పాటుగా ఓయూ నేతలు పాల్గొన్నారు. పలు జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మాట్లాడారు. ఇక్కడ చర్చించిన అంశాలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కమిటీల గురించి నాకు తెల్వదు : భట్టి
ఈ సమావేశంలో భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. కమిటీ కూర్పు కోసం తనను కూడా సంప్రదించలేదన్నారు. గతంలో పార్టీకి పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత ఇద్దరూ ముఖ్యమేనని చెప్పారని, కానీ, కమిటీల ఏర్పాటులో తనను ఎందుకు సంప్రదించలేదో తెలియదన్నారు. పార్టీ పదవుల పట్ల అసంతృప్తి ఉందని పలువురు నేతలు తనను కలిశారని, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ పదవులపై సీనియర్ నేతల్లోనూ అసంతృప్తి ఉందని, ఈసారి ఎలాంటి కసరత్తు చేయకుండా పీసీసీ కమిటీలను ప్రకటించారని భట్టి వెల్లడించారు. కమిటీలు ఏర్పాటు చేస్తారని ముందుగానే తాము కూడా కొన్ని ప్రతిపాదనలు చేశామని, వాటిని పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమైందన్నారు.
Also Read...