అమిత్ షాతో NTR భేటీ.. పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-08-24 07:51:49.0  )
అమిత్ షాతో NTR భేటీ.. పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో ఆర్ఆర్ఆర్ సిసిమాతో పాటు తాజా రాజకీయాల అంశాలు ప్రస్తావణకు వచ్చినట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్‌ను రాజకీయాలపై ఆసక్తి ఉందా అని అమిత్ షా అడగడంతో ప్రస్తుతం రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పినట్లు సమాచారం. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ నటన చూసి అమిత్ షా ప్రశంసించినట్లు తెలుస్తోంది. అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ, ఇతర నటీనటులు, తదుపరి చిత్రాలు గురించి ఇరువురు చర్చించినట్లు ఎన్టీఆర్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'అమిత్ షా గారిని కలవడం సంతోషకరం. మీ మంచి మాటలకు ధన్యవాదాలు.' అని మాట్లాడారు.

అధికార పార్టీ వైపు ఎర్ర పార్టీలు.. భవిష్యత్తులో కూడా పొత్తులేనా?

ఎన్టీఆర్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం

Advertisement

Next Story