- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయాల్లోకి Thalapathy Vijay.. నేడు వాళ్లతో కీలక భేటీ!
దిశ, వెబ్‌డెస్క్: తమిళ అగ్రహీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్‌లతో మాంచి జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న లియో సినిమాలో నటిస్తున్నాడు. అంతేగాక, షూటింగ్స్ గ్యాప్‌లో విజయ్ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలను విజయ్ ఖండించకపోగా.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఇవాళ విజయ్ చెన్నైలో పలువురు అడ్వకేట్లతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అడ్వకేట్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విజయ్ ఫ్యాన్స్ స్థాపించిన మక్కల్ ఇయక్కం తదుపరి కార్యచరణపై చర్చించనున్నారు.
అంతేగాక, ఈ సమావేశంలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనపై విజయ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇది రాజకీయ పార్టీగా మార్చబడుతుందని నటుడి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. “గ్రౌండ్ రెడీ అవుతోంది. అభిమానులకు నిర్దిష్టమైన పనులు అప్పగించారు. మేము ఓటర్ల డిమాండ్లు మరియు ప్రతి ప్రాంతంలోని కీలక సమస్యలపై సమాచారాన్ని సేకరిస్తున్నాము. రాజకీయ ప్రవేశం సమయాన్ని దళపతి (విజయ్) మాత్రమే ప్రకటిస్తారు” అని అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం సీనియర్ కార్యకర్త ఒకరు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Ram Charan కూతురితో మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిందిగా.. ఏకంగా అన్ని కోట్ల లాభాలా?