28 lakhs for lemon water: నిమ్మకాయ నీళ్లు 28 లక్షలు.. ఆశ్చర్యంలో ప్రజలు..

by Indraja |
28 lakhs for lemon water: నిమ్మకాయ నీళ్లు 28 లక్షలు.. ఆశ్చర్యంలో ప్రజలు..
X

దిశ వెబ్ డెస్క్: మనలో చాలామందికి నిమ్మకాయతో షరబత్ గురించి తెలుసు. అనాదిగా నిమ్మకాయ నీళ్లను భారతీయులు వాడుతున్నారు. టీలు, కాఫీలు లేని కాలంలో ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లకు నిమ్మకాయ నీళ్లు ఇచ్చేవారు. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుందేమో కానీ.. చేసే పద్ధతి మారదు. ఖర్చు మారదు. ప్రస్తుత కాలంలో సీజన్‌ను బట్టి నిమ్మకాయ రేటు ఉంటుంది. సగటు రేటు చూసుకుంటే పది రూపాయలకి 4 నుండి 6 నిమ్మకాయలు వస్తాయి.

1 నిమ్మకాయతో దాదాపు నలుగురు నిమ్మకాయ నీళ్లు తాగొచ్చు. అలాంటిది కేవలం నిమ్మకాయ నీళ్లకి 28 లక్షలు ఖర్చు చేశారు అంటే నమ్ముతారా..? అంటే నమ్మాలి అంటుంది టీడీపీ. గత ప్రభుత్వ హయాంలో కేవలం నిమ్మకాయ నీళ్ల కోసమే అప్పటి సీఎం 28 లక్షలు ఖర్చు చేశారని టీడీపీ ట్వి్ట్టర్ వేదికగా ఆరోపిస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో టీడీపీ పోస్ట్ చేసింది.

టిడ్కో కాలని ప్రారంభోత్సవ సభ అంటూ, ఒక ఫేక్ సభ పెట్టి, నిమ్మకాయ నీళ్లు సరఫరా అని రూ. 28 లక్షలు నొక్కేసారు అని ఈ ఫోటోపై రాసి ఉంది. కాగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టిట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పంధిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed