పాలిసెట్-2020 ఫలితాలు విడుదల..!

by Shyam |
పాలిసెట్-2020 ఫలితాలు విడుదల..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్:

పాలిసెట్ 2020 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ముందంజలో నిలిచారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ చైర్మన్ నవీన్ మిట్టల్ గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ఈ నెల 2వ తేదీన పాలిసెట్-2020 నిర్వహించగా.. వారం వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించడం జరిగిందన్నారు.

పాలిసెట్ పరీక్షలకు 73, 920 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ 56, 945 మంది మాత్రమే హాజరైనట్లు నవీన్ మిట్టల్ వెల్లడించారు. వీరిలో 46,207 మంది అర్హత సాధించగా.. అది 81.14 శాతంగా ఉందన్నారు. 34,748 మంది బాలురు హాజరు కాగా 78.72 శాతంతో 27,354 మంది.., 22,197 మంది బాలికలు హాజరు కాగా 84.93 శాతంతో 18,853 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

Advertisement

Next Story