డింగ్ టోన్‌పై పోలీసుల నజర్

by Shyam |   ( Updated:2020-10-23 06:44:57.0  )
డింగ్ టోన్‌పై పోలీసుల నజర్
X

దిశ , వెబ్ డెస్క్:
మహబూబాబాద్‌లో దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో డింగ్ టోన్ యాప్ ద్వారా నిందితుడు సాగర్ కాల్స్ చేశాడు. ఈ యాప్‌ను అతను ఫేస్ బుక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. యాప్‌ను ఆపరేట్ చేసేందుకు ఏయిర్ టెల్ నెట్ వర్క్‌ను నిందితుడు వాడాడు. ఈ యాప్ ద్వారా కాల్స్ చేసేందుకు లెట్స్ ట్రాక్ పర్సనల్ మెగా జీపీఎస్ డివైజ్‌ను అతను వాడినట్టు సమాచారం. కాగా డింగ్ టోన్ యాప్ ద్వారా వెళ్లిన 14 కాల్స్ ను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అవి మహబూబా బాద్ నుంచి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వివరాల కోసం 10 దేశాల యాప్‌లకు మహబూబాబాద్ పోలీసులు లేఖ రాశారని తెలుస్తోంది. ఈ మేరకు కాలిఫోర్నియా, లేక్ వే , మెట్ కాఫ్ , లాస్ ఏంజెల్స్ , శాన్ ఫ్రాన్సిస్కో, న్యూ హాంకాంగ్, సిగాండో , చైనా, మెల్ బోర్న్ కంపెనీలకు పోలీసులు లేఖలు రాసినట్టు సమాచారం…

Advertisement

Next Story