- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేల్కొని ఉండేది పోలీసు ఒక్కడే
దిశప్రతినిధి, ఆదిలాబాద్:
ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్కడు పోలీస్ అని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ అన్నారు. నిర్మల్ జిల్లాలో అదనపు ఎస్పీ రాం రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్మారకార్థం కాగడాను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమరవీరులకు వందనం చేస్తూ, వారి ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి, మునిసిపల్ చైర్మెన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ డీ.ఎస్.పీ ఉపేందర్ రెడ్డి, సీ.ఐ.లు శ్రీనివాస్, వెంకటేశ్, సోన్ సీఐ జీవన్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ లు రవీందర్, జైరాం నాయక్, సీసీఎస్ ఇన్స్ పెక్టర్ వై.రమేశ్ బాబు, ఆర్.ఐ.లు వెంకటి, అంజేద్ పాషా, యంటీఓ కృష్ణాంజనేయులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.