- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది ఆషామాషీ పేకాట కాదు…!
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం కర్నూలు జిల్లాలోని గుమ్మనూరులో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారు పేకాటరాయుళ్లు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు బైకులు, 5 వేలు, సామాన్యులు పట్టుబడితే ఆషామాషీనే…! కానీ అక్కడ పెద్ద తలకాయలు భారీగా నగదుతో, వాహనాలతో పట్టుబడ్డారు.
ఏకంగా 40 వాహనాలు, రూ.5.44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గురువారం కర్నూలు నుంచి వచ్చిన నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పోలీసులు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ అనుచరులు పోలీసులపై ఎదురు దాడికి పాల్పడినట్టు స్థానిక సమాచారం.
ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న 33 మంది పేకాట రాయుళ్లు పరారవుతుండగా వారిని పట్టుకొని చిప్పగిరి పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏఎస్పీ గౌతమిశాలి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న 40 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఆమె తెలిపారు. ఈ దాడుల్లో ఒక సీఐ, నలుగురు ఎస్సైలు, 20 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.