కోర్టు బోనుకు భూమా అఖిల ప్రియ..?

by srinivas |
కోర్టు బోనుకు భూమా అఖిల ప్రియ..?
X

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెపై 448, 419, 341, 342, 506, 366, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే అఖిల ప్రియను వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇక వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, బోయిన్‌పల్లిలో మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోదరులను ఐటీ అధికారుల పేరిట మంగళవారం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. భూమి తగాదాల వ్యవహారంలో భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌రావు కిడ్నాప్ చేయించారని ప్రవీణ్ రావు కుటుంబీకులు ఆరోపించారు. దీంతో అధికారులు అఖిల ప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త ప్రస్తుతం పరారీలో ఉండగా.. ఆయన సోదరుడు చంద్రహాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story