నల్లగొండలో పేదల ఆకలి తీరుస్తున్న ఖాకీలు

by vinod kumar |
నల్లగొండలో పేదల ఆకలి తీరుస్తున్న ఖాకీలు
X

దిశ, నల్లగొండ: ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఒక పక్క విధి నిర్వహణ చేస్తూ మరో పక్క నిరుపేదల ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు న‌ల్ల‌గొండ‌ ఖాకీలు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో విధి నిర్వహణ చేస్తూనే తమ మనవత్వాన్ని చాటుకుంటున్నారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న కిషన్ కుమార్, కరుణాకర్, హఫీజ్, అంజద్ ఖాన్, మధు, రఘు, జగదీష్, వీరబాబు, శేఖర్‌ తదితరులు గత ఆరు రోజులుగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదలు, యాచకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags; police, meals packets, distribution, nallagonda

Advertisement

Next Story

Most Viewed