బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇంట్లో సోదాలు

by Shyam |   ( Updated:2023-06-13 14:43:19.0  )
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇంట్లో సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి రఘునందన్‌‌రావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆయన అత్తగారిళ్లు, బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో 8చోట్ల తనిఖీలు చేపట్టారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం శామీర్‌పేట టోల్‌గేట్ వద్ద ఓ కారులో పట్టుబడిన రూ.40లక్షలు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు డబ్బులుగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో పోలీసులు సోదాలు చేస్తుండటంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed