- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరద నీటిలో యువకుడు.. రిస్క్ తీసుకున్న SI.. చివరకు ఏమైందంటే. (వీడియో)
దిశ, మానకొండూరు : భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చెరువులు, కుంటలు నిండి వరద నీరు మత్తడి దూకుతోంది. వరద నీరు రోడ్ల మీదకు రావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సోమవారం ఓ యువకుడు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా పోలీసులు అతడిని కాపాడారు. వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన భూపతి రెడ్డి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ జారీ పడి వరద నీటి ప్రవాహంలో పడిపోయాడు. వరద ప్రవాహానికి అతడు నీటిలో కొద్దిదూరం కొట్టుకుపోయాడు.
అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న గన్నేరువరం ఎస్ఐ ఆవుల తిరుపతి.. గ్రామంలో ఉన్న గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి వరద నీటిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు. ఈ క్రమంలో అతడిని కాపాడిన గజ ఈతగాళ్లను ఎస్ఐ అభినందించారు.
వారికి తన సొంత డబ్బు 3వేల రూపాయల నగదు పారితోషకం అందజేశారు. అనంతరం బాధితుడిని పోలీసు వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. రిస్క్ తీసుకుని వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడినందుకు ఎస్ఐ తిరుపతిని స్థానికులు అభినందించారు.