- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో పెచ్చరిల్లిన జాత్యాహంకారం..
దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాత్యాహంకారం పెచ్చరిల్లింది. నల్లజాతీయుడిపై ఓ పోలీసు అధికారి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ కావడంతో అక్కడి పోలీసుల తీరుపై నల్ల జాతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి జాతివివక్షకు వ్యతిరేకంగా అమెరికాలో ఉద్యమ కెరటాలు ఎగసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా ఇలానే నల్లజాతీయుడిని అరెస్టు చేసే క్రమంలో ఓ పోలీసుఅధికారి అతని మెడపై మోకాలితో నొక్కిపెట్టడంతో ఊపిరాడక చనిపోయాడు. ఆ సమయంలో అమెరికన్ సిటిజన్స్, నల్లజాతీయులు ‘వీ కాంట్ బ్రీత్ పేరు’తో పెద్ద ఉద్యమమే నడిపారు. అమెరికాలో ’జాతివివక్ష కాదనలేని సత్యం’ అని ఫస్ట్ లేడి మెలానియా ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు. నల్లజాతీయులపై దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రెసిడెంట్ ట్రంప్ విఫలమయ్యారని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పలుమార్లు విమర్శించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అక్కడ నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తాజా ఘటన ప్రతిపక్ష డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌కు ప్రధానాస్త్రం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.