- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొట్టి సంపుడేనా..ఫ్రెండ్లీ పోలీసింగ్!
దిశ, వెబ్‌డెస్క్:
తామూ మనుషులమే అన్న సంగతి మరిచారో..! లేక ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉంటే ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నారో తెలియదు కానీ, కుమార్తె చనిపోయిన దుఖంలో ఉన్న ఓ తండ్రి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుంటే..ఆ తండ్రి గుండె ఎంతగా విలవిల్లాడిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రొసీజర్లు ఎలా ఉన్నా..తన కుమార్తె శవాన్ని కూడా చూడనివ్వకుండా ఆ తండ్రిని బూటు కాలితో తన్నుతూ పోలీసులు అడ్డుకున్న తీరు చూస్తే, ఎంతటి కఠినాత్ములకైనా కోపం కట్టలు తెంచుకోక మానదు. పైగా మన తెలంగాణ పోలీసులే ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడుతుంటే ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అర్థమెక్కడుంది..?
వివరాల్లోకెళితే..సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని నారాయణ కాలేజీ కొల్లూరు క్యాంపస్‌లో ఇంటర్ చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని వేడుకున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. చివరకు మంగళవారం సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థి సంఘాలు స్పందించి ఆమె మృతదేహాన్ని సమీపంలోని సిటిజన్ ఆస్పత్రికి తరలించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఇవాళ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సమాచారమందుకున్న సంధ్యారాణి తండ్రి, కుటుంబీకులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని తరలిస్తుండగా..అడ్డుకునేందుకు విద్యార్థిని తండ్రి యత్నించగా ఖాకీలు జులుం ప్రదర్శించారు. ఓ పోలీసు బూటు కాలుతో తన్ని దురుసుగా ప్రవర్తించాడు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'మన పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శం..నేరం చేయాలన్నా భయపడేలా సీసీటీవీలు, సకల వ్యవస్థలు ఏర్పాటు చేశాం' అని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఉట్టివేననీ, అందుకు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.