పురిటి నొప్పులు..పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు

by Shyam |
పురిటి నొప్పులు..పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు
X

దిశ, మెదక్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను పోలీసులు తమ వాహనంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన మంగళవారం మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరొని గడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఉప్పరొని గడ్డకు చెందిన సింధు అనే గర్భిణికి ఈ రోజు మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి. బయట లాక్‌డౌన్ కొనసాగుతున్నందున వారికి ఏ వాహనం అందుబాటులో లేదు. దీంతో కుటుంబ సభ్యులు డయల్ 100కు ఫోన్ చేసి ఎస్ఐ సంపత్‌కు పరిస్థితిని వివరించారు. స్పందించిన ఆయన పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మద్దూర్ ఏఎస్ఐ రమేష్, కానిస్టేబుల్స్ యాకుబ్, అంజనేయులుకు సమాచారం అందించారు. వెంటనే వారు గ్రామానికి వెళ్లి పోలీసు వాహనంలో సింధును, కుటుంబీకులను తీసుకెళ్లి జనగామలోని చంపక్ హిల్స్ హాస్పిటల్లో చేర్పించారు. సరైన సమయంలో సింధును ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులను విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు, కుటుంబీకులు అభినందించారు.
విషయం తెలిసిన పోలీస్ కమిషనర్ ఏఎస్ఐ రమేష్, కానిస్టేబుల్స్ యాకుబ్ అంజనేయులును అభినందించారు. అనంతరం మద్దూర్ ఎస్ఐ సంపత్ మాట్లాడుతూ..లాక్‌డౌన్ సమయంలో వాహనాలు అందుబాటులో లేనందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.

Tags: lockdown, corona, pregnant lady, police vehicle, si,asi helps to women

Advertisement

Next Story

Most Viewed