వాళ్ల పరోక్ష ప్రమేయం.. అధికారుల కక్కుర్తి

by  |
వాళ్ల పరోక్ష ప్రమేయం.. అధికారుల కక్కుర్తి
X

దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామంలో గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా కొనసాగుతున్న కల్తీ పాల దందాను ఎస్ఓటీ అధికారులు పట్టుకున్నారు. ఆహార పదార్థాలలో జరుగుతున్న కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా… రాజకీయ నాయకుల పరోక్ష ప్రమేయం, అధికారుల కక్కుర్తితో ఈ కల్తీ దందా కొనసాగుతోంది.

వివరాళ్లోకి వెళితే… భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన కూసుకుంట్ల జంగారెడ్డి అనే వ్యక్తి గత కొన్నేళ్ల నుంచి భువనగిరిలో కల్తీ పాల దందాను కొనసాగిస్తున్నాడు. మంగళవారం సమాచారం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు బొల్లెపల్లి గ్రామ శివారు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలు తరలిస్తున్న ఆటోను తనిఖీలు చేశారు.

అనంతరం పాలలో ఉపయోగిస్తున్న డోలఫర్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు ఖాలివి13, మిల్క్ మిక్షింగ్ రాడు 1, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ 8 లీటర్లు, 300 లీటర్ల పాలతో కూడిన పాల క్యాన్లు ఆటోలో బయట పడ్డాయి. దీంతో ఆటోనడుపుతున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా, చాలా కాలంగా ఈ దందా నడుపుతున్నట్టు నిందితుడు జంగారెడ్డి ఒప్పుకున్నాడు.


Next Story

Most Viewed