ఏపీలో నయా దందా.. లిక్విడ్ రూపంలో మత్తుమందు

by srinivas |
ఏపీలో నయా దందా.. లిక్విడ్ రూపంలో మత్తుమందు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా నమోదవుతూ విలయతాండవం చేస్తోంది. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీ యువత గ్యాంగ్ వార్‌లు, గంజాయి విక్రయాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలు మాత్రం మానడం లేదు. ఇటీవల బెజవాడ గ్యాంగ్ వార్ రాష్ట్రంలో సంచనలం సృష్టించిన విషయం తెలిసిదే. అయితే తాజాగా గుంటూరులో ద్రవ రూపంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పాత గుంటూరు వాటర్ ట్యాంక్‌ల వద్ద విశాఖపట్టణానికి చెందిన ఆరుగురు సభ్యుల ముఠా గ‌త కొంత‌కాలంగా లిక్విడ్ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. వీరితో పాటు కోడెల రమేశ్ అనే వ్యక్తి అశోక్ నగర్‌లో కిళ్ళి షాపు నిర్వహిస్తూ..ర‌హస్యంగా గంజాయిని విక్రయిస్తున్నాడు. గంజాయిని మరిగించి వివిధ రకాల ద్రవాలు కలిపి ఈ ముఠా లిక్విడ్‌గా మారుస్తుంది. ఎలాంటి అనుమానం రాకుండా విద్యార్థులు, యువకులే లక్ష్యంగా విక్ర‌యిస్తున్నారు. ప‌క్కా స‌మాచాంతో రంగంలోకి దిగిన పాత గుంటూరు పోలీసులు.. విశాఖకు చెందిన జయరామ్, కొండబాబు, శ్రీకాంత్, చంద్రశేఖర్, షేక్ ఇబ్రహీంల‌తో పాటు అశోక్‌నగర్‌లో కిళ్ళి షాపు నిర్వహిస్తున్న కోడెల రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వీరి వ‌ద్ద నుంచి ఏడు కిలోల గంజాయి, రూ.2లక్షల 30వేల నగదు, 130 బాటిళ్ళ లిక్విడ్ గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, ఒసీపీ పేపర్ పాకెట్స్ సీజ్ చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న మ‌రికొన్ని ముఠాలు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించి, వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. లిక్విడ్ రూపంలో గంజాయి తయారు చేస్తున్న కేంద్రాలను గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతుంద‌ని, ప్ర‌జ‌లు కూడా గంజాయి గురించి ఎలాంటి స‌మాచారం ఉన్నా తెలియ‌జేయాల‌ని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed