దండకారణ్యంలో కాల్పుల మోత

by Anukaran |   ( Updated:2020-07-28 08:33:53.0  )
దండకారణ్యంలో కాల్పుల మోత
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అమరవీరుల వారోత్సవాలు ప్రారంభమైన మొదటి రోజే పోలీసులు మావోయిస్టుల పై దాడి చేశారు. ఛత్తీస్‌‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా థానా, కుట్రూ గుమ్నర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం డీఆర్జీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మంగళవారం పోలీసు బలగాలు గుమ్నర్ అడవులకు చేరుకున్న క్రమంలో మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు జరుపుతున్నారు.

పోలీసుల రాకను పసిగట్టిన మావోయిస్టులు ఫైరింగ్ ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే పరారయ్యారు. ఆ ప్రాంతం మొత్తాన్ని బలగాలు జల్లెడ పట్టగా ఘటనా స్థలంలో 3 గుడారాలు, 10 బ్యాగులు, 01 కుక్కర్ బాంబు, కార్డెక్స్ వైర్, ఎలక్ట్రిక్ వైర్, బ్యాటరీ, యూనిఫాంలు, మెడిసిన్, సాహిత్యం, నక్సలైట్ ఛాయాచిత్రాలు మరియు నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story