- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారీ చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు.. అంతా 20 సంవత్సరాల లోపు వారే..
దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్‌లో ఉన్న మెకానిక్ షెడ్‌లో జరిగిన చోరీ ఘటనను ఛేదించారు పోలీసులు. ఈ చోరీ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మాదాపూర్ 100 ఫీట్స్ రోడ్డులో శ్రీ మోటార్స్ పేరుతో అల్లం శ్రీకాంత్ రెడ్డి మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్ సర్వీస్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇతను నగరంలో మరో నూతన షోరూంను ప్రారంభించేందుకు అవసరమైన రూ.55లక్షల నగదును షెడ్‌లోని లాకర్‌లో పెట్టాడు. ఈనెల 9వ తేదీన షెడ్‌లో మెకానిక్‌గా పనిచేసే తహెర్ తన స్నేహితులు జావేద్, సైఫ్‌తో కలిసి అదేరోజు రాత్రి శ్రీమోటార్స్ వెనక ఉన్న డోరును తొలగించి లోపలికి వెళ్లి అల్మారాలోని రూ.55 లక్షల నగదును అపహరించారు. తెల్లవారు షెడ్‌కు వచ్చిన శ్రీకాంత్ రెడ్డి నగదు కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఈ దోపిడీకి సంబంధం ఉన్న ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ తాహెర్, సయ్యద్ జావేద్, సైఫ్ మొహియుద్దీన్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి పోలీసులు చోరీ సొత్తు రూ.55 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులని అరెస్ట్ చేశారు. వీరంతా 20 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం. అందరూ హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించడంతో పాటు చోరీ సొత్తును పూర్తిగా రికవరీ చేసిన సిబ్బందిని డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.