మాయిస్టులకు పట్టున్న ఆ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు

by  |   ( Updated:2021-12-05 01:39:07.0  )
Police-2
X

దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ పూర్ మండల కేంద్రంలోని బొమ్మాపూర్ మూలమలుపు వద్ద ఆదివారం ఉదయం పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ఉండేందుకు సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ముందస్తుగా వాహన తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానంగా కనిపించినవారిని కూడా విచారిస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి 20వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అడవి ప్రాంతంలో ఏమైనా సంఘటనలు జరగవచ్చన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆదేశాల మేరకు మహదేవ్ పూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని గ్రామాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

మన్యంలో మావోయిస్టుల అలజడి.. రోడ్డు రోలర్ దగ్ధం

polic-1

Advertisement

Next Story