- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మారువేషంలో.. మద్యం వేట
దిశ, మెదక్: ఓ మద్యం విక్రయదారుడితో ఇద్దరు వ్యక్తులు మద్యం కావాలని అడిగారు. అనంతరం రెండు కాటన్ల మద్యాన్ని రూ.64 వేలకు బేరం కుదుర్చుకున్నారు. తర్వాత విక్రయదారుడు రమ్మని చెప్పిన చోటుకు వెళ్లారు. అలా వెళ్లిన వెంటనే ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అన్నారు. దీంతో విక్రయదారుడి గుండెజారిపోయింది. ఆ వ్యక్తులు ఎవరో కాదు.. అక్రమంగా అమ్ముతున్న మద్యం వేటకు మారువేశంలో వచ్చిన పోలీసులు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. మండలంలోని తునికి నల్ల పోచమ్మ ఆలయం వద్దనున్న దుకాణాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు నర్సాపూర్ సీఐ నాగయ్య, ఎస్సై రాజశేఖర్‌లకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగి వారెవరో తెలియనివ్వకుండా, మద్యం కావాలంటూ అనుమానితులతో బేరం మాట్లాడారు. ఒక్కో కాటన్‌కు రూ.32 వేల చొప్పున రెండు కాటన్ల మద్యానికి బేరం కుదుర్చుకుని రూ.64 వేలు తీసుకెళ్లారు. అమ్ముతున్న వ్యక్తి పోచమ్మ ఆలయం సమీపంలోని దుకాణం వద్దకు రమ్మనడంతో అక్కడికెళ్లారు. మద్యం అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఘటన స్థలంలో దొరికిన 10 కాటన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ మద్యం విలువ వాస్తవానికి సుమారు రూ.60 వేలు కాగా, రహస్యంగా రూ.2.50 లక్షల వరకు అమ్మడానికి నిందితులు సిద్ధమైనట్టు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టినట్టు తెలిపారు.
Tags: medak, police, kowdipally, liquor, ci naganna, si rajashekar