- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గన్ చూపించి బెదిరింపు.. పట్టుకున్న పోలీసులు
దిశ, వెబ్ డెస్క్: భారీ ప్లాన్ వేసి దొంగతనం చేయాలనుకున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నోయిడాలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గౌరవ్ సింగ్, సదానందే అనే ఇద్దరు యువకులు ఓ వ్యక్తికి గన్ చూపించి దోపిడీ చేశారు. పర్సు, ఫోన్ తీసుకుని బైక్ మీద పారిపోయారు. అనంతరం కొంతదూరం వెళ్లిన తర్వాత వారు పర్సు చూసుకోగా, అందులో రూ.3200 నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం కార్డులు ఉన్నాయి. అంతటితో సంతృప్తి చెందని దొంగలు గన్ ఉంది కదా అని మళ్లీ వెనక్కి వచ్చి, ఏటీఎం పిన్ నెంబర్ చెప్పాలంటూ మళ్లీ గన్ చూపించి ఆ వ్యక్తిని బెదిరించారు. దీంతో తీవ్ర భయాందోళన చెందిన ఆ వ్యక్తి పిన్ నెంబర్ కూడా చెప్పాడు. ఆ తర్వాత వారు వెంటనే బైక్ మీద పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంతలో వేగంగా బైక్ మీద వస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు చెక్ పోస్టు వద్ద ఆపారు. దీంతో దొంగలు వారిద్దరిపై కాల్పులు జరిపారు. పోలీసులు వారి బారి నుంచి తప్పించుకుని దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు.