ఏపీలో నాటు సారాపై పోలీసుల ఉక్కుపాదం

by srinivas |
ఏపీలో నాటు సారాపై పోలీసుల ఉక్కుపాదం
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యనిషేదంపై చిత్తశుద్దితో సరికొత్త ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మద్యం ధరలను పెంచి, షాపులను తగ్గించారు. బెల్టు షాపులు కానీ, నకిలీ మద్యం తయారీ లేదా నాటుసారా తయారీ కేంద్రాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. మద్యంపై వలంటీర్లకు కూడా కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు నకిలీ మద్యం లేదా నాటుసారా తయారీ కేంద్రాలపై ఎలాంటి సమాచారం లేదు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో నాటుసారా తయారీ కేంద్రాలు ఏపీలో వెలిశాయి. వాటిపై వలంటీర్లతో సమాచారం అందుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా ఏకకాలంలో సుమారు నాలుగు గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం పంచుతూ లేదా ప్రలోభాలకు గురి చేస్తూ ఎవరైనా పట్టుబడితే వారిపై అనర్హతవేటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పోలీస్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖాధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో సుమారు పదివేల మంది పోలీస్, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాలు పంచుకోవడం విశేషం. ఈ టీంలలో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్‌లు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. వలంటీర్లు, వేగుల సమాచారం ప్రాతిపదికన ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను వారు ధ్వంసం చేశారని తెలుస్తోంది.

tags:police attack, duplicate liquor, local body election, special operations,

Advertisement

Next Story

Most Viewed