- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీమంత్రికి పోలీస్ అసోషియేషన్ స్ట్రాంగ్ వార్నింగ్.. పరుగెత్తించి కొట్టడం మాకు బాగా తెలుసు..
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అసోషియేషన్ తీవ్రంగా ఖండించింది. పోలీసుల పట్ల అయ్యన్న పాత్రుడు విజ్ఞతతో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణలత సూచించారు. పోలీస్ శాఖను చెప్పుకోలేని విధంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని ఆమె ఆరోపించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఖాకీ డ్రస్‌ను వేసుకున్న మీరు పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తాకట్టు పెట్టేశారంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమన్నారు.
తమ డ్రెస్‌పై ఉండే మూడు సింహాలపైనా చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడారని చెప్పుకొచ్చారు. పోలీసుల మాట తీరు మార్చుకోవాలని లేకపోతే బట్టలూడదీసి కొడతామని అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. పోలీసులపై నోరు జారితే ప్రజలే బట్టలూడదీసి కొడతారని ఈ విషయాన్ని సదరు మాజీమంత్రి గుర్తుంచుకోవాలని సూచించారు. పోలీసులను తరిమితరిమి కొడతాం.. పరుగెత్తించి కొడతాం అని అయ్యన్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తరిమితరిమి కొట్టడం.. పరుగులు పెట్టించి కొట్టడం.. మాట తీరు మార్చుకోవడం ఇవన్నీ పోలీస్ శాఖకు ట్రైనింగ్‌లో ఇస్తారని ఇవి ప్రత్యేకించి మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
మా పోలీస్ శాఖ ఇవన్నీ ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే ఉపయోగిస్తుందంటూ స్ట్రాంగ్‌గా చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితను కించపరిచేలా.. చులకన చేసేలా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నారని అది మార్చుకోవాలని సూచించారు. ఇప్పటికైనా మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మారితే రాజకీయాల్లో ఉన్నత పదవులు అధిరోహిస్తారంటూ హితవు పలికారు. పోలీసులకు అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ పోలీస్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణలత డిమాండ్ చేశారు.