- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్కీ డ్రా గుట్టు రట్టు..
దిశ, నిజామాబాద్ రూరల్: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల నుండి ధనార్జనే ధ్యేయంగా పలువురు డబ్బులు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జక్రాన్‌పల్లి మండలానికి చెందిన అర్గుట్ డైమండ్ ఎలక్ట్రానిక్స్ నిర్వాహకులు లక్కీ డ్రా అంటూ మోసానికి తెరలేపారు. అర్గుల్ గ్రామం 44 జాతీయ రహదారిపై పక్కన గల పీవీఆర్ గార్డెన్‌లో గత 14 నెలల నుండి లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ఈ రోజు చివరి డ్రా నిర్వహిస్తున్న సమయంలో దాడి చేసి లక్కీడ్రా నిర్వాహకులను పట్టుకున్నట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.
వారి వద్ద నుండి లక్కీ డ్రా కు సంబంధించిన బ్రోచర్లు, డ్రాకు సంబంధించిన కాయిన్స్, మొబైల్ ఫోన్స్‌తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత కార్యక్రమాలను నమ్మవద్దని ఎస్సై సాయిరెడ్డి కోరారు. ఈ లక్కీ డ్రా బాధితులు సుమారు రెండు వందల మంది ఉంటారని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరుచనున్నట్లు తెలిపారు.