- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, శామీర్ పేట్: గంజాయి తరలిస్తున్న ముఠాని శామీర్ పేట పోలీసులు పట్టుకున్నారు. ఇదే కేసులో జైలు జీవితం గడిపినా బుద్ధి మారక మళ్లీ అదే దారిపట్టారు. జైలులో అయిన పరిచయాలతో ముఠాగా ఏర్పాడి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మంగళవారం శామీర్ పేట పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో నిందితులు అడ్డంగా బుక్కాయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ సుధీర్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా వసుందర గ్రామానికి చెందిన తారకేశ్వర్ గంజాయి కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు కర్నాటకకు చెందిన అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా కర్నాటక గుల్బర్గాకు చెందిన షబ్బీర్‌ను పరిచయం చేసుకున్నాడు. షబ్బీర్ నుంచి తారకేశ్వర్ గంజాయి కొనుగోలు చేసి ఆ గంజాయిని మేడ్చల్, శామీర్ పేట్, జవహర్ నగర్, యాప్రాల్ తదితర ప్రాంతాల్లో తెలిసిన వాళ్లకు అమ్ముకుంటున్నాడు. షబ్బీర్‌కు భద్రాచలం నుంచి శ్రీశైలం గంజాయిని సరఫరా చేస్తున్నాడని సమాచారం.
ఈ క్రమంలో తారకేశ్వర్ మంగళవారం 4 కేజీలను గంజాయిని షబ్బీర్ అమ్మాడు. తనకు పరిచయం ఉన్న యాప్రాల్‌కు చెందిన ప్రభురాజ్ గంజాయి కావాలని అడగడంతో తనతో పాటు తీసుకెళ్లి షబ్బీర్ నుంచి 270 గ్రాములున్న 22 చిన్న ప్యాకెట్లును ఇప్పించాడు. వాళ్లను తన కారులో హైదరాబాద్‌లో డ్రాప్ చేసి మిగతా గంజాయిని విక్రయించడానికి షబ్బీర్ శామీర్ పేట్ వస్తుండగా ఓఆర్ఆర్ టోల్ గేటు వద్ద వాహనాల తనిఖీలో పట్టుబడ్డాడు.
అతడితోపాటు తారకేశ్వర్, ప్రభురాజ్ ఉన్నారు. షబ్బీర్ వద్ద నుంచి టీఎస్ 09ఈడీ 1299 నంబర్ గల టాటా కారు, 20 కేజీల చొప్పున ఉన్న 10 గంజాయి ప్యాకెట్లు, రెండు సెల్ ఫోన్లు, తారకేశ్వర్ నుండి 2 గంజాయి ప్యాకెట్లు, ప్రభురాజ్ వద్ద 22 గంజాయి చిన్న ప్యాకెట్లు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్రీశైలం పరారీలో ఉన్నాడని, పట్టుబడిన వ్యక్తులను కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ సుధీర్ కుమార్ తెలిపారు.