భైంసాలో స్పెషల్‌ డ్రైవ్.. ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్

by Aamani |   ( Updated:2021-12-08 00:04:27.0  )
Special drive
X

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓవైసీనగర్‌లో బుధవారం ఉదయం ఏఎస్పీ కిరణ్ కారే, ప్రభుత్వ హెల్త్ సూపర్వైజర్ కలిమ్‌ ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డిసెంబర్ నెలలో కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్కువ నమోదు ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ పోలీసులు కార్డెన్ సెర్చ్, ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సరైన పత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు, పలు ఫోర్ వీలర్ వాహనాలు సీజ్ చేశామని తెలిపారు.

Special drive

అనంతరం హెల్త్ సూపర్వైజర్ కలిమ్ మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సినేషన్ తక్కువగా నమోదైన ఓవైసీ నగర్‌లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి దాదాపు 226 మందికి వ్యాక్సిన్ వేశామని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌ను అటు పోలీసులు, ఇటు ఆరోగ్య సిబ్బంది ఇద్దరు కలిసి విజయవంతంగా నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భైంసా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ ప్రదీప్, పోలీస్, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed