కరోనా ఎఫెక్ట్‌: భారత్-ఈయూ సమావేశం వాయిదా

by Shamantha N |
కరోనా ఎఫెక్ట్‌: భారత్-ఈయూ సమావేశం వాయిదా
X

ప్రధాని నరేంద్ర మోదీ తన బెల్జియం పర్యటనను వాయిదా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతోపాటు ఇప్పటివరకు 3500 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో ప్రధాని తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. భారత్- యురోపియన్ యూనియన్ వార్షిక సమావేశాలకు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో పర్యటించడం అంత మంచిది కాదని ఇరు దేశాల వైద్య ప్రతినిధులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈయూ- భారత్ వార్షిక సమావేశం వాయిదా పడింది. ఇరుదేశాలకు అనువైన తేదీల్లో త్వరలోనే సమావేశం జరుగుతుంది’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని ప్రధాని మోదీ ఇప్పటికే నిర్ణయించిన విషయం విధితమే.

tags : pms brussels visit, coronavirus

Advertisement

Next Story

Most Viewed