- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంత పని చేయొద్దు..
దిశ ప్రతినిధి, ఖమ్మం :
అన్యాయం చేయాలని చూస్తున్న సింగరేణి సంస్థ నుంచి ఉద్యోగాలిప్పించండి లేదంటే నిరసనగా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతివ్వాలని ఇల్లందు ప్రాంతానికి చెందిన ఇస్లావత్ దిలీప్ చేసిన విజ్ఞప్తికి పీఎంవో కార్యాలయం స్పందించింది. అలాంటి చర్యలకు పూనుకోవద్దని, సమస్యను పరిష్కరించేలా వెంటనే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌కు ఆదేశాలిస్తున్నట్లుగా దిలీప్ మెయిల్‌కు సమాచారం చేరవేసింది. మూడు రోజుల క్రితం రాష్ట్రపతి కోవింద్‌కు, ప్రధానమంత్రి మోదీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దిలీప్ సెల్ఫీ వీడియో ద్వారా జరిగిన అన్యాయాన్ని వివరించారు. కొన్నేళ్ల క్రితం ఓపెన్ కాస్టుల కోసమంటూ తమ భూములను సింగరేణి సంస్థ తీసుకుందని తెలిపారు. అయితే ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా నేటికి స్పందించడం లేదని వీడియోలో తెలిపాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నాడు. లేదంటే ఈ అన్యాయానికి నిరసనగా ఆత్మహత్యకు అనుమతివ్వాలని కోరడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే….