- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ ఐక్యత ప్రధానం : మోడీ
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో రైతు ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న తరుణంలో పౌరులందరూ దేశ ఐక్యతకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ ఐక్యతను గౌరవించాలని సూచించారు. ఈ అంశాలే ప్రాతిపదికగా ప్రతి పౌరుణ్ణి కలుపుకుని ముందుకు సాగాలని తెలిపారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో నిర్వహించనున్న ‘చౌరీ చౌరా’ చారిత్రక ఘట్టానికి శతవార్షిక ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని గురువారం ఆన్‌లైన్‌లో మాట్లాడారు.
బ్రిటీషర్ల పాలనను వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా యూపీలో చౌరీ చరా ఘటన జరిగింది. ఇందులో ముగ్గురు పౌరులు, 22 మంది పోలీసులు కన్నుమూశారు. అనంతరం అక్కడే ఉన్న పోలీసు స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనకు వచ్చే ఏడాదితో 100 ఏళ్లు నిండుతున్న సందర్భంగా శతవార్షిక కార్యక్రమాలను యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ భారత చరిత్రలో చౌరీ చౌరా ఘటనకు తగినంత ప్రాధాన్యత దక్కలేదని, ఆ ఘటనలో అమరులైన వారిని స్మరించుకోవాలని, వారి నుంచి మరెందోరో స్ఫూర్తి పొందారని వివరించారు.
చౌరీ చరా పోరాటంలోనూ రైతులు కీలకపాత్ర పోషించారని ప్రధాని అన్నారు. దేశ పురోభివృద్ధి వెనుక వారి కృషి అమోఘమని చెప్పారు. గత ఆరేళ్ల కాలంలో రైతులను స్వయంసమృద్ధులు చేసే అనేక చర్యలను తమ ప్రభుత్వం తీసుకున్నదని తెలిపారు. మహమ్మారి కాలంలోనూ సాగు రంగం అభివృద్ధి నిలిచిపోలేదని వివరించారు. సుమారు 1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానించామని, ఫలితంగా రైతులు నేరుగా లబ్ది పొందేలా తయారుచేస్తున్నామని చెప్పారు.