పేదలు, కూలీల కష్టాలు వర్ణనాతీతం: ప్రధాని మోడీ

by Shamantha N |
పేదలు, కూలీల కష్టాలు వర్ణనాతీతం: ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరముందని ప్రధాని మోడీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం 11 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా కట్టడికి ప్రజలంతా పోరాటం చేస్తున్నారని, ఇంతటి క్లిష్ట సమయంలో పోలీసులు, మీడియా, వైద్య సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి అవిశ్రాంతంగా పని చేస్తున్నారన్నారు. మహిళా సంఘాలు మాస్కులు తయారు చేసి చేయూతనిచ్చారన్నారు. కరోనా సమయంలో పేదలు, కూలీల కష్టాలు వర్ణనాతీతమన్నారు. ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఆదర్శంగా తీసుకునేలా కరోనా విషయంలో మనం భవిష్యత్తులో ఇంకా అత్యంత జాగ్రత్తగా పోరాటం చేయాలని సూచించారు. కరోనా కారణంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని ఆయన చెప్పారు. యోగా ద్వారా కరోనాను అధిగమించే అవకాశముందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో విద్యార్థుల కోసం ఆన్ లైన్ పాఠాల కోసం సరికొత్త ఆవిష్కరణలు చేశామని చెప్పారు. ఆత్మనిర్భర్ ద్వారా దేశం ఉన్నతస్థితికి చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed