‘వీబో’ ఖాతాను తొలగించిన మోడీ

by Shamantha N |
‘వీబో’ ఖాతాను తొలగించిన మోడీ
X

న్యూఢిల్లీ: ట్విట్టర్ తరహాలో ఉండే చైనీస్ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘వీబో’ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తొలిగారు. ఈ సోషల్ మీడియా ఖాతాను బుధవారం తొలగించారు. తొలగింపు ప్రక్రియ జాప్యంగా సాగిన ఎట్టకేలకు ఈ ఖాతాలోని అన్ని 115 పోస్టులను రిమూవ్ చేశారు. వీబోలో మోడీది అధికారిక ఖాతా కావడంతో తొలగింపు ప్రక్రియ కాస్త క్లిష్టంగా మారింది. 113 పోస్టులు తొలగించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో దిగిన రెండు ఫొటోలు మాత్రం అంత సులువుగా డిలీట్ కాలేవు. వీబో సైట్ ఆ దేశాధ్యక్షుడి ఫొటోలను డిలీట్ చేయదని తెలిసింది. వీబోలో ప్రధాని మోడీకి 2.44వేల ఫాలోవర్లు ఉన్నారు. 59 చైనీస్ యాప్‌లపై నిషేధాన్ని విధించిన రోజుల వ్యవధిలోనే ప్రధాని ఈ చైనీస్ సోషల్ సైట్ నుంచి తొలగించడం గమనార్హం.

బాయ్‌కాట్ చైనా: థర్మల్ కెమెరా టెండర్ రద్దు చేసిన రైల్వే ప్రయాణికులు మాస్కులు ధరించారా? లేదా? అనే విషయాన్ని పసిగట్టడంతోపాటు బాడీ టెంపరేచర్‌ను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా కెమెరాల కోసం భారత రైల్వే రైల్ టెల్ విభాగం ఓ టెండర్‌ను ప్రకటించింది. 800 కెమెరాల కోసం బిడ్‌లను ఆహ్వానించింది. గతంలో ఈవోఐ(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్)ను రద్దు చేస్తూ మళ్లీ బహిరంగా ఈవోఐ నిర్వహించనున్నట్టు రైల్వే ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా పార్టిసిపేషన్ పెరగొచ్చని తెలిపింది. అయితే, ఈ రద్దు నిర్ణయంవెనుక చైనా బాయ్‌కాట్ నినాదామున్నదని కొన్ని వర్గాలు తెలిపాయి. చాలా మంది వ్యాపారులు ఆ టెండర్ ద్వారా చైనా ఉత్పత్తులకు మేలు కలుగవచ్చునని రైల్‌టెల్‌కు తెలిపారని, తత్ఫలితంగానే ఆ టెండర్‌ను రద్దు చేసిందని వివరించాయి.

Advertisement

Next Story

Most Viewed