- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని నోట విశాఖ కుర్రాడి మాట
దిశ, విశాఖపట్నం: ప్రధాని మోడీ నోట విశాఖ కుర్రాడి మాట పలికింది. స్వదేశీ, స్ధానికంగా తయారు చేసిన వస్తువులనే వాడుతున్న విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ ప్రాంతానికి చెందిన వెంకట మురళీప్రసాద్‌ను ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలంతా స్థానికంగా తయారైన వస్తువులను నిత్య జీవితంలో వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా స్థానిక, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. మురళీ ప్రసాద్ తన ఇంట్లో ప్రతి రోజూ ఉపయోగించే వస్తువుల జాబితాను తయారు చేశారని, 2021లో సాధ్యమైనంత వరకు భారత దేశంలో తయారైనవాటినే ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారని మోదీ తెలిపారు.
ఈ సందర్భంగా మురళీ తయారు చేసిన వస్తువుల జాబితాను ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. వెంకట మురళీ ప్రసాద్ ‘ఏబీసీ 2021’ శీర్షికతో ఈ చార్ట్‌ను తయారు చేశారని, ‘ఆత్మ నిర్భర్ ఘర్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్’ అంటూ ఆరు కేటగిరీలలో వస్తువుల పేర్లను పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫ్ కేర్, బట్టలు, ఆఫీస్ అండ్ వర్క్, కిచెన్, ఇతర ఐటమ్స్ విభాగాల్లో రోజూ ఉపయోగించే వస్తువులు, యంత్రాలైన ఏసీ, టీవీ, ఫోన్, ఫ్రిజ్, టూత్ బ్రష్, టూత్ పౌడర్, సబ్బు, షాంపూ, ఫేస్ మాస్క్, బట్టలు, సైకిలు, బైక్ వంటివాటిని పేర్కొంటూ, సాధ్యమైనంత వరకు వీటిలో ఎక్కువ వస్తువులను మన దేశంలో తయారైనవాటినే ఉపయోగిస్తానని వెంకట మురళీ పేర్కొన్నారు.