- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చేతులు కట్టుకుని కూర్చోం: మోడీ
దిశ, వెబ్ డెస్క్: శాంతిని కోరుకున్నంత మాత్రాన చేతులు కట్టుకుని కూర్చోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సరిహద్దు వివాదమై గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో శుక్రవారం లడాఖ్ లో ఆయన ఆకస్మికంగా పర్యటించి జవాన్లతో మాట్లాడారు. అక్కడి ప్రస్తుత పరిస్థితులపై ప్రధానికి ఆర్మీ అధికారులు వివరించారు. అనంతరం ఆయన జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. సరిహద్దుల్లో జవాన్ల వల్లే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని, భారత సైనికుల తెగువ వెలకట్టలేనిదని, మీ ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మరిచిపోదంటూ భద్రతా బలగాల శౌర్యానికి సెల్యూట్ అని ఆయన అన్నారు. జవాన్ల త్యాగం నిరుపమానమైనదని, అమరులైన సైనికులకు మరోసారి నివాళి అని ప్రధాని అన్నారు. ధైర్యవంతులే శాంతి కోరుకుంటారని, శాంతిపై భారత్ కు ఉన్న నిబద్ధతను ప్రపంచమంతా గమనించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ లడాఖ్ లో ఆకస్మిక పర్యటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.