రైతు సాధికారతలో ఆ రైలు పెద్ద ముందడుగు: మోడీ

by Shamantha N |
రైతు సాధికారతలో ఆ రైలు పెద్ద ముందడుగు: మోడీ
X

దిశ,వెబ్‌డెస్క్: రైతు సాధికారతలో కిసాన్ రైలు పెద్ద ముందడుగని ప్రధాని మోడీ అన్నారు. వందో కిసాన్ రైలును ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బంగాల్‌లోని షాలిమార్ వరకు కిసాన్ రైలు ప్రయాణిస్తుంది. త్వరగా పాడై పోయే పండ్లు, కూరగాయల లోడింగ్, ఆన్‌లోడింగ్‌కు రైలులో అనుమతి ఇవ్వనున్నారు.

ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ…. గత 4 నెలల్లో కిసాన్ రైలు నెట్ వర్క్ విస్తరించిందని తెలిపారు. దేశంలోని పలు వ్యవసాయ ప్రాంతాలను ఈ రైలు కలుపుతుందని అన్నారు. రైతులు తమ పండ్లు, కూరగాయలను సుదూర మార్కెట్ ప్రాంతాలకు తరలించేందుకు రవాణాపై అధికంగా ఖర్చు చేసేవారని తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని 3 ఏండ్ల క్రితం తమ ప్రభుత్వం టమాట, ఉల్లిగడ్డలు, బంగాళదుంపల రవాణాపై యాభై శాతం సబ్సిడీ ఇచ్చినట్టు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed