వణికిస్తోన్న మరో వేరియంట్.. ప్రధాని మోడీ అత్యవసర భేటీ

by Anukaran |   ( Updated:2021-11-27 02:07:45.0  )
వణికిస్తోన్న మరో వేరియంట్.. ప్రధాని మోడీ అత్యవసర భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని ఇప్పుడు మరో వేరియంట్ భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్ధారించడంతో అన్ని దేశాలు అలెర్ట్ అయ్యాయి. కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ గా గుర్తిచింది అంతర్జాతీయ సమాజం. దాంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా లతో భేటీ అయ్యారు.

ప్రపంచ దేశాలు కొత్త వేరియంట్ కు బయపడి కొత్త ఆంక్షలు పెడుగున్నాయి. ఇదే సందర్భంలో ప్రధాని మీటింగ్ పెట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒమిక్రాన్ వేరియంట్ మొదటగా దక్షిణాఫ్రికాలో బయట పడింది. తర్వాత మెల్లగా చుట్టు పక్కల దేశాలకు వ్యాపించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కంటే ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పేసింది. కరోనా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని పలు నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.

కొత్త వేరియంట్ కు బయపడి చాలా దేశాలు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు మొదలు పెట్టాయి. ఆఫ్రికా దేశాల నుంచి రాక పోకలను కూడా నిలిపివేశాయి. మన దేశం కూడా ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేయాలని పలువురు నాయకులు కేంద్రాన్ని కోరుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం విమానాలు నిలిపివేయాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed