ఏప్రిల్ 14వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్ : భారత ప్రధాని మోడీ

by Shamantha N |   ( Updated:2020-03-24 10:01:59.0  )
ఏప్రిల్ 14వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్ : భారత ప్రధాని మోడీ
X

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. భారత్ లో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశమంతటా లాక్ డౌన్ విధిస్తున్నట్టు పేర్కొన్నారు. రాబోయే 21రోజులు చాలా కీలకమని దేశ ప్రజలందరూ బయటకు రావొద్దని సూచించారు. లాక్ డౌన్ అంటే కర్ఫ్యూ లాంటిదని , ఎవరూ నిబంధనలు ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని జయించాలంటే ప్రభుత్వం గీసిన లక్ష్మణ రేఖను దాటొద్దని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని తాను ఒక ప్రధానిమంత్రి గా చెప్పడం లేదని మీ కుటుంబంలోని సభ్యుడిగా చెబుతున్నానని సందేశమిచ్చారు. కరోనా వైరస్ బారిన పడిన వారిని కాపాడేందుకు వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారని, వారికోసం ప్రజలు ప్రార్థించాలని ప్రధాని దేశప్రజలను కోరారు. కరోనా.. అంటేనే బయటకు రావొద్దని దానిని ఓ సూచికలా భావించాలన్నారు. ప్రాణం ఉంటేనే ఏదైనా సాధించవచ్చునని, ప్రాణం విలువ తెలుసుకోవాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రధాని కితాబిచ్చారు. కష్ట కాలంలో మెడికల్ సిబ్బంది చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు.

Tags:pm modi, corona, till april 14th india lockdown, 21 days, people don’t come out side

Advertisement

Next Story

Most Viewed