- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్‌కు రూ.1000 కోట్ల ప్రకటించిన కేంద్రం
అహ్మదాబాద్: తౌక్టే తుఫాన్‌తో అతలాకుతలమైన గుజరాత్‌కు ప్రధానమంత్రి రూ. 1000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇవి వెంటనే ఏకకాలంలో రాష్ట్రానికి అందుతాయని వివరించారు. కేంద్రమంత్రిత్వ శాఖ అధికారులు రాష్ట్రానికి వచ్చి నష్టాన్ని అంచనా వేసిన తర్వాత సరిపడా నిధులూ అందుతాయని తెలిపారు. తుఫాన్ కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడ్డవారికి రూ. 50వేల పరిహారాన్ని అందిస్తామని వివరించారు. ఈ పరిహారం తుఫాన్ ప్రభావిత అన్ని రాష్ట్రాల్లో వర్తిస్తుందని పేర్కొన్నారు. తౌక్టే తుఫాన్‌తో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, రాజస్తాన్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలో పలువురు గాయపడ్డారు. బుధవారం ఉదయాన్నే ఢిల్లీ నుంచి గుజరాత్‌లోని భావ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోడీ గుజరాత్, డయ్యూలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విహంగవీక్షణం గావించారు. హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత అహ్మదాబాద్‌లో అధికారులతో భేటీ అయ్యారు. మోడీతోపాటు సీఎం విజయ్ రూపానీకూడా ఇందులో పాలుపంచుకున్నారు. తుఫాన్ సహా కరోనా పరిస్థితుల వివరాలనూ పీఎం మోడీ తెలుసుకున్నారు.
గుజరాత్‌లో 45 మంది మరణం
తౌక్టే తుఫాన్‌తో గుజరాత్ అల్లకల్లోలమైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తౌక్టే కారణంగా 45 మంది మృతి చెందారు. సౌరాష్ట్ర రీజియన్‌లోని అమ్రేలీ జిల్లాలోనే 15 మంది మరణించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అతితీవ్ర తుఫాన్‌గా పరిణమించిన తౌక్టే తీరాన్ని దాటి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది. సుమారు ఆరువేల గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, 16వేల ఇండ్లు దెబ్బతిన్నాయి.
అరేబియా.. శోకసంద్రం
కోస్ట్ గార్డులు ముందస్తు హెచ్చరికలనూ ఖాతరు చేయకుండా సముద్రంలో చమురు క్షేత్రాలు, ఇతర పారిశ్రామిక పనుల్లో మునిగిన కార్మికులు సురక్షిత ప్రాంతాల్లోకి చేరుకోలేదు. కానీ, అతితీవ్ర తుఫాన్‌గా మారిన తౌక్టే అరేబియా సముద్రంలో పంజావిసిరింది. నౌకా దళం రంగంలోకి దిగి చాలా వరకు కార్మికులను రక్షించినా, పదుల సంఖ్యల ప్రాణాలు అప్పటికే గాల్లో కలిశాయి. ఇప్పటికీ కనీసం 50 మంది గురించిన ఆచూకీ లభించలేదు. సముద్రంలో మునిగిన పీ-305 నౌకపై ఉన్నవారిలో 186 మందిని సేఫ్‌గా ఒడ్డుకు చేర్చింది. దానికి టగ్ బోట్‌గానున్న వరప్రద నుంచి ఇద్దరిని రక్షించింది. పీ-305కి చెందిన 26 మంది మృతదేహాలను రికవరీ చేసింది. ఐఎన్ఎస్ కోచి బుధవారం 125 మందిని రక్షించగా, నాలుగు మృతదేహాలను రికవరీ చేసింది.